రష్మిక వస్త్రధారణపై భారీ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. నీకు అవసరమా అంటూ కామెంట్స్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక ప్రస్తుతం వరుస బాలీవుడ్ చిత్రాలతో పాటు, తెలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా రష్మిక బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ 50వ పుట్టిన రోజు ఈ సందర్భంగా బర్త్ డే పార్టీలో తళుక్కుమన్న సంగతి మనకు తెలిసిందే.

సౌత్ ఇండస్ట్రీ నుంచి రష్మికకు బర్త్ డే ఆహ్వానం రావడంతో ఈ ముద్దుగుమ్మ వెరైటీ వస్త్రధారణలో పార్టీలో తళుక్కుమన్నారు. అయితే ఈ డ్రెస్సులో రష్మిక చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.ఆ డ్రెస్‌ కాళ్ల కిందవరకు ఆనుతుండటంతో నడవడానికి కొంత ఇబ్బంది పడుతూ పదే పదే డ్రెస్సును సర్దుకోవడంతో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు కనిపించారు. ఈ క్రమంలోని ఈ డ్రెస్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్దఎత్తున నెటిజన్లు వస్త్రధారణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇలాంటి దుస్తులు ధరించి అన్ని ఇబ్బందులు పడటం అవసరమా… ఆ డ్రస్ అంత కంఫర్ట్ గా లేనప్పుడు వేసుకోవడం ఎందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా పలువురు నెటిజన్లు తన వస్త్రధారణ పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో పుష్ప 2 , విజయ్ దళపతి సరసన నటిస్తున్నారు. అదే విధంగా బాలీవుడ్ లో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.