నీవల్లే నాకు అవమానం అంటూ కృతి సనన్ కు ట్వీట్ చేసిన నెటిజన్.. క్షమాపణలు చెప్పిన కృతి. !

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా కృతిసనన్ ప్రధాన పాత్రలో మిమి అనే చిత్రంలో నటించారు. ఇందులో ఉన్నటువంటి పరం అనే సాంగ్ బాగా ఫేమస్. అయితే ఈ పాట వల్ల ఒక వ్యక్తి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అని తాజాగా కృతి సనన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలు విషయానికి వస్తే.. కృతిసనన్ నటించిన ఈ సినిమాలోని పరం సుందరి అనే పాట పై ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. అతని పేరు పరం ఛాయా కాగా అతని ఇంటిపేరు పరం అని చిన్నప్పటి నుంచి తాను తన ఇంటిపేరు వల్ల ఎప్పుడు అవమానం పొందలేదని మొదటిసారిగా మీరు నటించిన ఈ సినిమాలోని పాట వల్ల తన స్నేహితులు తనని అవమాన పరుస్తున్నారు కేవలం మీ వల్ల నాకు అవమానం జరిగింది అంటూ సరదాగా ట్వీట్ చేస్తూ తనకు టాగ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ చూసిన కృతిసనన్ వెంటనే స్పందిస్తూ… అయ్యో సారీ అంటూ స్మైలీ ఎమోజి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఈమె ప్రభాస్ నటిస్తున్నటువంటి ఆది పురుష్ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఇందులో కృతి సనన్ సీత పాత్రలో నటించగా ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.