Home News మోనాల్‌ని కాపాడండి.. సోనూసూద్‌కు నెటిజ‌న్ల రిక్వెస్ట్‌లు..!

మోనాల్‌ని కాపాడండి.. సోనూసూద్‌కు నెటిజ‌న్ల రిక్వెస్ట్‌లు..!

సుడిగాడు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన గుజరాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం, హిందీ, గుజ‌రాతీ భాష‌లలో హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి చిత్రం మోనాల్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే న‌టిగా అంత‌గా రాణించ‌లేక‌పోతున్న మోనాల్ బిగ్ బాస్ తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు వ‌చ్చింది. సీజ‌న్‌4లో తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన మోనాల్ ఎనిమిది వారాల పాటు హౌజ్‌లో ఉండి ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌చ్చింది.

34E68096 68C3 4A2A A927 93173C19778F | Telugu Rajyam

చూడ‌చక్క‌ని అందం, యూత్‌ని ఆక‌ర్షించే గ్లామ‌ర్ ఉన్న మోనాల్‌లో కొన్ని నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. చిన్న విష‌యాల‌కి ఏడ‌వ‌డం, తెలుగు స‌రిగా మాట్లాడ‌లేక‌పోవ‌డం వ‌ల‌న చాలా సార్లు నామినేట్ అయింది.ఇక అఖిల్‌- అభిజిత్ ఫీలింగ్స్‌తో ఈమె గేమ్ ఆడుతుంద‌నే అపవాదు కూడా మూట‌గ‌ట్టుకుంది. టాస్క్‌ల‌లో కూడా విప‌రీత‌మైన రొమాన్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌కి తెగ విసుగుపుట్టిస్తుంద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. గుజ‌రాతీ అమ్మాయి అవడం వ‌ల‌న కూడా మోనాల్‌కు కాస్త వ్య‌తిరేఖ‌త ఏర్ప‌డింది.

 

అయితే మోనాల్‌పై లేని పోని నింద‌లు వేస్తూ, ఆమెను వివ‌క్ష‌కు గురి చేస్తున్న నేప‌థ్యంలో రియ‌ల్ హీరో సోనూసూద్‌కు మోనాల్ అభిమానులు రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ప్రియ‌మైన సోనూసూద్ స‌ర్, ఆమెను మీరు స‌పోర్ట్ చేయ‌డం. గుజ‌రాత్ నుండి వ‌చ్చిన ఆమెను ఇక్క‌డ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావ‌డం లేదు. మీకు మోనాల్‌తో ప‌రిచయం ఉంటే ఆమెను ఈ దుష్ప్ర‌చారం నుండి కాపాడండి.ఆమెకు ఈ రేంజ్‌లో వ్య‌తిరేఖ‌త ఉంద‌ని తెలిస్తే ఏమ‌వుతుందోన‌నిన భ‌య‌మేస్తుంది. ద‌య‌చేసి మీ మ‌ద్ద‌తు ఆమెకు తెల‌పండి అంటూ సోనూ, మోనాల్ క‌లిసి దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు.

కాగా, మోనాల్ గ‌త రెండు మూడు వారాల నుండి బాగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది. ఆరోవారంలో ఆమెను ఎలిమినేట్ చేయాల‌ని త‌క్కువ ఓట్లు వేసిన కూడా బిగ్ బాస్ త‌న ద‌త్త‌పుత్రిక‌లా కాపాడారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మోనాల్‌ని సేవ్ చేసేందుకు కుమార్ సాయిని బ‌లి చేశారంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు కామెంట్స్ చేశారు.

Related Posts

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

జనసేన కొంప ముంచనున్న విశాఖ స్టీల్ ప్లాంట్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖ స్టీలు ప్లాంటుని సందర్శించబోతున్నారట అతి త్వరలో. ఈ విషయాన్ని ఇటీవలే జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన విశాఖ వెళ్ళారు, స్టీలు...

Related Posts

Latest News