‘ఫ్యామిలీ స్టార్’ పై నెగెటివ్‌ ప్రచారం.. ఫిర్యాదు వార్తలను తోసిపుచ్చిన దేవరకొండ!

‘ఫ్యామిలీస్టార్‌’పై నెగెటివ్‌ రివ్యూలు ఇస్తున్న వారిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలకు నటుడు విజయ్‌ దేవరకొండ స్పందించారు. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటో ఇప్పటిది కాదన్నారు. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది.

ఇదిలా ఉండగా, సినిమా విడుదలకు విజయ్‌ దేవరకొండపై విమర్శలు కురిపిస్తూ సోషల్‌విూడియాలో పలువురు నెటిజన్లు ట్రోలింగ్‌ చేశారు. దీనిపై విజయ్‌ టీమ్‌ మాదాపూర్‌ పీఎస్‌ సైబర్‌ కైమ్ర్‌ విభాగంలో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రతికూల కామెంట్స్‌ చేస్తున్నారని తెలిపింది. ఆ పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే విజయ్‌ సైతం పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారంటూ ఓ ఫొటో చక్కర్లు కొట్టింది. దీనిపై ఆయన్ని సంప్రదించగా.. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టతనిచ్చారు. అది ఇప్పటి ఫొటో కాదని.. కొవిడ్‌ సమయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దిగినప్పటిదన్నారు.