గత రెండు మూడు రోజులుగా రకుల్ ప్రీత్, సారా అలీఖాన్‌ల పేరు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతూ వచ్చింది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యాక.. విచారణలో భాగంగా బాలీవుడ్ ప్రముఖల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రకుల్ ప్రీత్, సారా అలీఖాన్‌ల పేర్లు బయట పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో రకుల్ ప్రీత్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

NCB Says That Rakul And Sara ALi Khan Names Not In The List Of Drugs Case
నిత్యం వ్యాయాయం, వెజిటేరియన్ ప్రాముఖ్యతను చెబుతూ ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చిందని చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి మాత్రం అలాంటి పనులా? అంటూ అందరూ కామెంట్ చేశారు. ఇక వికారాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ నుంచి వెంటనే వెళ్లిపోయింది, రకుల్ మెడకు డ్రగ్స్ కేసు బిగుస్తుందని ఏవేవో వార్తలు వచ్చాయి. ఇక సందులో సడేమియా అన్నట్టు రకుల్ ప్రీత్‌పై శ్రీ రెడ్డి ఫైర్ అయింది.

NCB Says That Rakul And Sara ALi Khan Names Not In The List Of Drugs Case
ఇక తాజాగా ఎన్‌సీబీ అధికారులు స్పందించారు. రియా చక్రవర్తి విచారణలో భాగంగా ఎలాంటి పేర్లు చెప్పలేదు. బయట జరుగుతున్న ప్రచారం మేరకు సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ పేర్లు వెల్లడించలేదు, మా లిస్ట్‌లో వారు లేరు అవన్నీ ఫేక్ వార్తలు అని స్పష్టం చేశారు. దీంతో కొందరు డ్యామిట్ కథ అడ్డం తిరిగిందే.. అనుకుంటున్నారు. పాపం రకుల్‌ను మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. నిజంగా డ్రగ్స్ కేసులో రకుల్ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఈ కేసులో ఇంకెంత మంది పేర్లు ఇలా బద్నాం అవుతాయో చూడాలి.