NBK108 : అనౌన్సమెంట్ వదిలారు కానీ ఈ అప్డేట్ లేనట్టేనా.?

ఇప్పుడు నందమూరి నటసింహ బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ లో 107వ సినిమాని “వీరసింహా రెడ్డి” గా చేస్తుండగా నెక్స్ట్ అయితే తన 108వ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడితో ఫిక్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై అయితే రేపు డిసెంబర్ 8న ఓ మాసివ్ అప్డేట్ రానున్నట్టుగా సినీ వర్గాలు కోడై కూశాయి.

అలాగే రేపు ముహూర్తంతో పాటుగా సినిమా టైటిల్ ఏంటి అనేది రివీల్ చేస్తారని తెలిసింది. కానీ ఇప్పుడు అయితే చిత్ర యూనిట్ నుంచి ఓ అప్డేట్ బయటకి వదిలారు. అయితే ఇందులో ఈ చిత్రం రేపు ముహూర్తం జరుపుకుంటుంది అని కన్ఫర్మ్ చేయగా ముహూర్త సమయం 9 గంటల 36 నిముషాలు అని కూడా పొందుపరిచారు.

కానీ ఇందులో ఎక్కడా కూడా సినిమా టైటిల్ అప్డేట్ కూడా ఇస్తున్నామన్నట్టు మాత్రం ఎక్కడా  అయితే రేపు సినిమా టైటిల్ అప్డేట్ లేనట్టే అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా యంగ్ బ్యూటీ ప్రియాంకా జవల్కర్ ఫిక్స్ అయ్యిందని కూడా రూమర్స్ ఉన్నాయి. మరి వాటిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.