సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉంది. దాదాపు ఆరు సంవత్సరాలుగా తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడిపిన నయనతార తమ సుదీర్ఘ ప్రేమకి మూడుముళ్ల బంధంతో పులిస్టాప్ పెట్టారు. కొన్ని నెలల క్రితం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఎంతో ఘనంగా వివాహమన్నంతో ఒకటైన ఈ జంట ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం వరకు న్యూయార్క్ లో హనీమూన్ ఎంజాయ్ చేసిన ఈ జంట ప్రస్తుతం దుబాయ్ లో సందడి చేస్తున్నారు. విగ్నేష్ శివన్ పుట్టినరోజు సందర్భంగా నయనతార దుబాయ్ లోని బుజ్జి ఖలీఫా టవర్స్ ఎదురుగా భర్త తన పుట్టినరోజుని బంధుమిత్రుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నయనతార గురించి విగ్నేష్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.
ఈ క్రమంలో విగ్నేష్ ఈ వీడియో షేర్ చేస్తూ… నీతో కలిసి జరుపుకుంటున్న ఎనిమిదవ పుట్టినరోజు ఇది. ప్రతి పుట్టినరోజుని మునుపటి పుట్టినరోజు కంటే ఎంతో స్పెషల్ గా చేసావు.. కానీ ఈ పుట్టినరోజు మాత్రం చాలా స్పెషల్ . లవ్ యు అండ్ థాంక్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విగ్నేష్ పుట్టినరోజు సందర్భంగా నయనతార తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయిలో ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.