రణవీర్ సింగ్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇది కదా సక్సెస్ అంటే!

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో జాతి రత్నాలు సినిమా ద్వారా వన్ ఆఫ్ ది టాలెంటెడ్ హీరో అయిపోయాడు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోరే సినిమాలో హీరో స్నేహితుడిగా కనిపించే నార్త్ ఆడియన్స్ కి దగ్గర అయ్యాడు. తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన నవీన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.

తర్వాత డైరెక్టర్ అనుదీప్ కె.వి తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా అతని క్రేజ్ మారిపోయింది. అయితే నవీన్ పోలిశెట్టి తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో శ్రీలీలతో కలిసి సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ షోలో మాట్లాడుతూ తనకు బాలీవుడ్ లో జరిగిన ఒక మోసం గురించి చెప్పాడు.

ముంబైలో అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేవాడిని కాదు, ప్రతి ఆడిషన్ కి వెళ్లేవాడిని అలా ఒక ఆడిషన్ కి వెళ్ళినప్పుడు రణవీర్ సింగ్ కి ఫోటోలు తీసే క్యారెక్టర్ కి సెలక్ట్ అయినట్లు చెప్పారు. నేను కూడా సంతోషంగా సూట్ రెంటుకు తీసుకొని వాళ్ళు చెప్పిన టైంకి చెప్పిన లోకేషన్ కి వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్లేసరికి నాలాగా 50 మంది ఆర్టిస్టులు కనిపించారు.

నాతో నా ఒక్కడిదే క్యారెక్టర్ అని చెప్పారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే రణవీర్ సింగ్ రెడ్ కార్పెట్ మీద నడుచుకుని వస్తుంటే ఫోటోగ్రాఫర్స్ టకటక ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆ 50 మంది ఫోటోగ్రాఫర్స్ లో నేను ఒకడిని. కట్ చేస్తే జాతి రత్నాలు సినిమాకి ఉత్తమ నటుడిగా అదే రణవీర్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి.