నానిగారూ.! ఎక్కువ చేస్తున్నారు.!

గతేడాది వచ్చిన సినిమాల్లో ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కాంతార’ నెంబర్ వన్ సినిమాలైతే, ఈ ఏడాదికి ‘దసరా’ సినిమానే టాప్‌లో వుండబోతోంది.. అంటూ నేచురల్ స్టార్ నాని తన సినిమా గురించి కాస్త ఓవరాక్షన్ చేశాడు.

అవును నిజమే ‘దసరా’ ప్యాన్ ఇండియా సినిమానే. అంత మాత్రాన అన్ని ప్యాన్ ఇండియా సినిమాలూ ‘ఆర్ఆర్ఆర్’ అయిపోవుగా. కానీ, నానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో మరి. అంత ఓవర్ చేస్తే.. ఇదిగో ఇలాగే వుంటది. నెటిజన్స్ ట్రోల్స్‌కి గురవుతున్నాడు.

ఏమాత్రం తేడా కొట్టినా అంతే సంగతి. నాని టార్గెట్ అయిపోతాడంతే. రీసెంట్‌గా వచ్చిన టీజర్ బాగుంది. ఓకే. కానీ, వర్కవుట్ అవుతుందని ఇప్పుడే ఎలా చెప్పగలం.? ఏమో.! ‘కాంతార’కు వర్కవుట్ అయినట్లుగా అవుతుందేమో చూడాలి మరి. శ్రీకాంత్ ఓదెల అను కొత్త దర్శకుడు తెరకెక్కించిన ‘దసరా’లో కీర్తి సురేష్, నానితో జత కడుతోంది.