దెబ్బకు మార్చేసింది.. అందుకే నమ్రత అలా చేసింది!

Namrata Shirodkar Disabled Comment Section In Instagram

సోషల్ మీడియాలో నమ్రత ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. మహేష్ బాబు చేసే అల్లరి గురించో లేదా సితారా వేసే క్యూట్ క్యూట్ స్టెప్పుల గురించో లేదా గౌతమ్‌ను ఎలా ఏడిపిస్తున్నారో చూపించే వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. లాక్ డౌన్ మొత్తం అలాగే సందడి సందడిగా గడిచింది. సితార చిన్ని చిన్ని మాటలెన్నో చూశాం. వాటికి ఫ్యాన్స్ కూడా సంబరపడిపోయి కామెంట్లు పెట్టేవారు.

Namrata Shirodkar Disabled Comment Section In Instagram
Namrata Shirodkar Disabled Comment Section In Instagram

అలా నెటిజన్లు పెట్టే కామెంట్లకు నమ్రత కూడా రియాక్ట్ అయ్యేది అప్పుడప్పుడు. అయితే ఈ మధ్య నమ్రతకు చేదు అనుభవం ఎదురైంది. బాలీవుడ్‌లోని డ్రగ్స్ కేసులో నమ్రత పేరు రావడంతో ఆమె పేరుకు డ్యామేజ్ ఏర్పడింది. 2017లో జయా సాహాతో నమ్రత చాటింగ్ చేసినట్టు ఓ వాట్సప్ చాట్ లీకైంది. ఈ మేరకు జాతీయ చానెల్లలో నమ్రత పేరు మార్మోగిపోయింది.

Namrata Shirodkar Disabled Comment Section In Instagram
Namrata Shirodkar Disabled Comment Section In Instagram

ఇక ఈ ఘటనపై స్పందించమని, మీరు డ్రగ్స్ వాడుతారా? ఈ వార్తలు నిజమేనా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలతో ఇన్‌స్టాగ్రాంలో నెటిజన్లు విసిగించడం మొదలుపెట్టారు. ఇక ఈ ప్రశ్నలతాకిడిని తట్టుకోలేక సెట్టింగ్స్ మార్చుకుంది. అతి కొద్ది మంది మాత్రమే కామెంట్ పెట్టేలా మార్చేసుకుంది. దీంతో సాధారణ జనాలు ఆమె పోస్ట్‌లకు ఇకపై కామెంట్స్ పెట్టలేరు. అయినా ఇలా చేయడం ఎందుకో మరి. డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఓ చిన్న పోస్ట్ వేస్తే సరిపోయేది కదా.