ఆ విషయంలో ఎంతో కంగారు పడుతున్న నాగార్జున.. ఏం జరిగిందంటే?

నవమన్మధుడు ఆరు పదుల వయసు దాటిన నాగార్జున మాత్రం తన గ్లామర్ కోల్పోకుండా నేటి తరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో చేస్తున్నప్పటికీ నాగార్జునకు మాత్రం లక్ కలిసి రాలేదనే చెప్పాలి. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత ఏ విధమైనటువంటి హిట్ లేక సతమతమవుతున్నారు.

Nagarjuna 1 | Telugu Rajyamఅయినప్పటికీ నాగార్జున ప్రతిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ చిత్రంగా నాగార్జున బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాగార్జున తో పాటు నాగ చైతన్య నటించడం విశేషం ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగ చైతన్య సరసన కృతి శెట్టి సందడి చేయనున్నారు. ఇకపోతే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున సొంతంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా ముందుగా అనుకున్న బడ్జెట్ కన్నా అధిక బడ్జెట్ కావడంతో నాగార్జున ఈ సినిమా విషయంలో కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక హిట్ సినిమా కూడా తన ఖాతాలో వేసుకుని నాగార్జున ఈ సినిమా కోసం అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేస్తుందా అన్నగారు లో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావంతో ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles