Bigg boss 4: నోయల్, అభిజిత్ కు క్లాస్ పీకిన నాగార్జున.. నీ ఆట నువ్వు ఆడుకో నోయల్.. అంటూ ఫైర్

nagarjuna fire on bigg boss contestants on nominations

వామ్మో.. ఎంత కోపం.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు ఫుల్లు కోపం వచ్చింది. మామూలుగా కాదు.. కంటెస్టెంట్లు అందరిపై ఫైర్ అయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమోను మాటీవీ తాజాగా విడుదల చేసింది.

nagarjuna fire on bigg boss contestants on nominations
nagarjuna fire on bigg boss contestants on nominations

నిజానికి ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియను ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. నామినేషన్ సమయంలో లైట్ తీసుకొని ఎవ్వరికి వారు.. నామినేషన్ లోకి వచ్చారు. బిగ్ బాస్ రూల్స్ ను పట్టించుకోకుండా.. తమ ఇష్టం ఉన్నట్టు ఆడుతున్న కంటెస్టెంట్లందరిపై నాగ్ సీరియస్ అయ్యారు.

ఆటను సీరియస్ గా తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడుదామని అనుకుంటున్నారేమో.. నేను అలా చేయనీయను. నా ముందు మీ వేషాలు కాదు.. అన్నట్టుగా నాగార్జున ఫుల్లు సీరియస్ అయ్యాడు.

nagarjuna fire on bigg boss contestants on nominations
nagarjuna fire on bigg boss contestants on nominations

నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన టాస్క్ ను ఎవ్వరూ సీరియస్ గా తీసుకోకుండా.. అందరూ ఎటువంటి కారణాలు లేకుండా నామినేషన్లలోకి రావడాన్ని నాగ్ తీవ్రంగా తప్పుపట్టారు.

నోయల్, అభిజిత్ కు క్లాస్ పీకారు. నీ ఆట నువ్వు ఆడు నోయల్. వేరే వాళ్లది నువ్వెందుకు ఆడుతున్నావు. అభిజిత్.. నీకు ఓట్లేసి నిన్ను ఎలిమినేట్ చేయరని అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా? మీరందరూ ఎందుకింత లైట్ తీసుకుంటున్నారు గేమ్ ని.. అంటూ అందరికీ క్లాస్ పీకడంతో బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

దీనికి సంబంధించిన ప్రోమోను కూడా చూసేయండి మరి..

Game ni serious ga teskomani housemates mida #Nagarjuna fire 🔥 🔥 #BiggBossTelugu4 Today at 9 PM