కరోనా వైరస్ ప్రస్తుతం ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. మన దేశం ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కరనా బారిన పడుతున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్ అని తేలింది.
కరోనా పాజిటివ్ రావడంపై నాగబాబు స్పందించాడు. ఇన్‌ఫెక్షన్ ఎల్లప్పుడూ మనల్ని బాధకు గురిచేయదు. దాన్ని ఇతరులకు సాయం చేసే అవకాశంగా మలుచుకోవాలి.. త్వరలోనే కోలుకుని ప్లాస్మా డోనర్‌గా మారుతానని ఆయన తెలిపాడు. కోవిడ్ పాజిటివ్‌తో పోరాడేందుకు పాజిటివ్‌గా ఉంటానని పేర్కొన్నాడు. ఇక నాగబాబుకు కరోనా అని పేర్కొనడంతో కళ్యాణ్ దేవ్ స్పందించాడు. త్వరగా కోలుకోవాలి నాగబాబాయ్.. అని కోరుకున్నాడు. స్పీడ్ అనే ప్రేమకు చిహ్నం. థ్యాంక్స్ కళ్యాణ్ అని నాగబాబు చెప్పుకొచ్చాడు.
నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం నాగబాబు అయితే కేవలం అదిరింది షూటింగ్ కోసమే బయటకు వచ్చాడు. కానీ ఆయనకు కరోనా ఎలా సోకిందో మాత్రం తెలియడం లేదు. ఇక నాగబాబుకు కరోనా రావడంతో అదిరింది టీం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అయింది.