అది మన దౌర్భాగ్యం.. పనికి మాలిన సంప్రదాయం.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య నాగబాబు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతూనే ఉంది. యూట్యూబ్, ట్విట్టర్‌లో నాగబాబు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మనీ సిరీస్ అంటూ జనాలకు ఉపయోగపడే ఓ నాలుగు మాటలు చెబుతున్నాడు. యూట్యూబ్‌లో వరుసగా వీడియోలు చేస్తూ వచ్చిన నాగబాబు ఈ మధ్య నెటిజన్ల ప్రశ్నలకు సమాధానిమిస్తూ వస్తున్నాడు.

Nagababu About Women Empowerment
Nagababu About Women Empowerment

మరో వైపు తాజాగా నాగబాబు వాల్మీకిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వాల్మీకి మాస్ కథలు రాయడంలో స్పెషలిస్ట్ అట. మాస్ కథలు రాసే వారిలో తనకిష్టమైన వారిలో వాల్మీకి ప్రథముడట. రాముని కథను ఎంతో మంచిగా రాసినందుకు వాల్మీకికి థ్యాంక్స్ అంటూ ఓ పోస్ట్ చేశాడు. వాల్మీకి జయంతి నాడు చేసిన ఈ పోస్ట్ బాగానే వైరల్ అయింది. తాజాగా నాగబాబు మనీ సిరీస్‌లో భాగంగా కొన్ని విషయాలు చెప్పాడు.

Nagababu About Women Empowerment
Nagababu About Women Empowerment

ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకునే యంత్రాల్లా చేస్తున్నారు.. అది మన దౌర్భాగ్యం.. చాలా ఇంట్లో ఆడవాళ్లను ఇంట్లో పెట్టి మగాళ్లు బయటకు వెళ్లి పని చేస్తుంటారు.. ఆడాళ్లు ఇంట్లోనూ ఉండాలనే పనికి మాలిన సంప్రదాయం అంటూ నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రోమోలో ఇంతలా మాట్లాడంటే.. పూర్తి వీడియోలో నాగబాబు మహిళా సాధికారత గురించి బాగానే మాట్లాడినట్టు కనిపిస్తోంది.