ఆ ఆర్టిస్ట్ రోజుకు రెండు మూడు పెగ్గులు వేస్తాడు.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

Nagababu About Persons who does not have Strength To Earn Money

మెగా బ్రదర్ నాగబాబు డబ్బు ప్రాముఖ్యత, డబ్బు సంపాదించాల్సిన ఆవశ్యకత గురించి గత కొన్ని రోజులుగా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. తాను జీవితంలో చూసినా లేదా అనుభవించిన సంఘటలను ఆధారంగా డబ్బు విలువ, సంపాదించాల్సిన అవసరం, ఎలా కోటీశ్వరులు అవ్వొచ్చు.. ఎవరికి డబ్బులు సంపాదించే అర్హత ఉంది? ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా డబ్బు సంపాదించే అర్హత లేని వారి గురించి నాగబాబు వివరించాడు.

Nagababu About Persons who does not have Strength To Earn Money
Nagababu About Persons who does not have Strength To Earn Money

కొందరు వ్యక్తులకు డబ్బు సంపాదించే అర్హత లేదని చెబుతూ.. కొన్ని ఉదహరణలు కూడా చెప్పాడు. సోమరిబోతులకు, దురలవాట్లు ఉన్న వారికి, క్రమశిక్షణ లేని వారికి, ప్రణాళిక లేనటు వంటివారికి, నిజాయితీ లేనివారికి డబ్బులు సంపాదించే అర్హత లేదని నాగబాబు తెలిపాడు. ఉద్యోగం చేసుకుంటూ.. ఉదయం తొమ్మది నుంచి సాయంత్రం ఐదు వరకు కష్టపడ్డాం ఇక చాలు అనే వారికి డబ్బులు సంపాదించే అర్హత లేదని అన్నాడు.

Nagababu About Persons who does not have Strength To Earn Money
Nagababu About Persons who does not have Strength To Earn Money

ఇక దురలవాట్లు ఉన్న వారికి కూడా డబ్బులు సంపాదించే అర్హత లేదన్నాడు. టీవీ లెవెల్ ఆర్టిస్ట్ గురించి చెబుతూ.. అతను రోజు రెండు మూడు పెగ్గులు వేసి పడుకుంటాడని తెలిపాడు. ఎందుకు అని అడిగితే… అంతకంటే చేసేది ఏముంటుంది.. రోజు పడుకునే ముందు రెండు మూడు పెగ్గులు వేసి పడుకుంటే అయిపోతుంది.. జీవితానికి ఇంతకంటే ఏం కావాలని అన్నాడట. ఇప్పటికీ అతను ఏం ఎదగలేదు.. అలాగే ఉన్నాడని తెలిపాడు. దురలవాట్లున్న వారికి డబ్బులు సంపాదించే అర్హత లేదంటూ ఆ ఆర్టిస్ట్‌ను ఉదాహరణగా చెప్పాడు గానీ అతనెవ్వరన్నది మాత్రం బయటకు చెప్పలేదు.