మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మామూలుగా ఎవరెవరి బర్త్ డేలకు స్పెషల్‌గా విషెస్ చెబుతుంటాడు. సినీ రాజకీయ ప్రముఖులు, సన్నిహితులకు సంబంధించిన బర్త్ డేలకు పోస్ట్‌లు చేస్తుంటాడు. అలాంటి తనకు ఎంతో ఇష్టమైన కొడుకు బర్త్ డే నాడు తన మనసులోని మాటలను, ప్రేమను బయటకు చెప్పకుండా ఉంటాడా?. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా నిన్న స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చింది. కొత్త సినిమా మూవీ అప్డేట్లను ఇచ్చేశారు.
ముందుగా వరుణ్ తేజ్ చిన్న నాటి ఫోటోను షేర్ చేసి సింపుల్ హ్యాపీ బర్త్ డే అని చెప్పేశాడు నాగబాబు. ఆ తరువాత గని సినిమా మోషన్ పోస్టర్‌ను షేర్ చేస్తూ టీంకు విషెస్ అందించాడు. ఇక వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా మెగా హీరోలు చేసిన విషెష్, నిహారిక వేసిన పోస్ట్, ఇతర సెలెబ్రిటీల అందించిన శుభాకాంక్షలు తెగ వైరల్ అయ్యాయి. ఇక చివరకు నాగబాబు తన కుమారుడి గురించి చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. చిన్న తనంలో వరుణ్ తేజ్ ఇప్పుడున్న వరుణ్ తేజ్ గురించిపోల్చుతూ తన భావాలను పంచుకున్నాడు.
ప్రతీ చిన్న విషయాన్ని విసిగించే ఓ చిన్న బాలుడు.. తన భుజాలపై ఎన్నో బాధ్యతలను నెరవేర్చే మనిషి, ప్రతీ ఏడాది ఎంతో ఎత్తుకు ఎదుగుతూ వెళ్లోన్న మనిషిలా మారిపోయాడు. నా చిన్న తండ్రి పెద్ద హంక్‌లా మారిపోయాడు. ఎంత కష్టాన్నైనా ఒక్కడే భరిస్తాడు.. వాడి అంకితభావం, అకుంటిత దీక్షం సాటి లేనిది.. సరైన కొడుకు.. జాగ్రత్తగా చూసుకునే అన్నయ్య.. ఎంతో ఇష్టమైన స్నేహితుడిగా కుటుంబాన్ని చూసుకుంటాడు. నీవు ఉంటే నాకు కొండంత బలం.. అంటూ వరుణ్ తేజ్‌పై నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.