జాతీయ జెండాను ఆవిష్క‌రించిన చిరంజీవి.. జెండా పండుగ వేడుక‌లో పాల్గొన్న‌ మెగా ఫ్యామిలీ

72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు దేశవ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు సంప్ర‌దాయ దుస్తులు ధరించి ఉద‌యాన్నే జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌ను స్థాపించిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో జాతీయ జెండాను ఆవిష్క‌రించి దేశంపై త‌న‌కున్న భ‌క్తిని చాటుకున్నారు. జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ వేడుక‌కి చిరుతో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు, మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌తో పాటు మెగా ఫ్యాన్స్ హాజ‌ర‌య్యారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన ఆఫీసు కార్యాల‌యంలో జాతీయ జెండాను ఆవిష్క‌రించినట్టు తెలుస్తుంది.

Chi | Telugu Rajyam
చిరంజీవి ఈరోజు ఉద‌యం త‌న ట్విట్ట‌ర్ ద్వారా దేశ ప్ర‌జ‌లంద‌ర‌కి, మెగా అభిమానుల‌కు, ఆత్మీయులంద‌రికి 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుబాకాంక్ష‌లు తెలిపారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయ‌సంక‌ల్పించిన మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు వ‌చ్చి, ర‌క్త‌దానం చేసిన‌, చేస్తున్న రక్త‌దాక్త‌ల‌కు హృద‌య పూర్వక ధ‌న్య‌వాదాలు. ర‌క్త దానం చేయండి, ప్రాణ దాత‌లు కండి అంటూ ఓ వాయిస్ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న చిరంజీవి మ‌రి కొద్ది రోజుల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఆచార్య చిత్ర షూటింగ్‌ని పూర్తి చేయ‌నున్నాడు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య పాత్ర‌పోషిస్తున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని టాక్. మ‌రోవైపు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫ‌ర్ రీమేక్ మొద‌లు పెట్ట‌నున్నారు చిరు. ఈ సినిమా షూటింగ్ స‌గ‌భాగం పూర్తైన వెంట‌నే వేదాళం రీమేక్ స్టార్ట్ చేయ‌నున్నాడు. ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను చిరు ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles