Home News సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న మెగా బ్ర‌ద‌ర్ ఫ్యామిలీ సెల్ఫీ పిక్

సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న మెగా బ్ర‌ద‌ర్ ఫ్యామిలీ సెల్ఫీ పిక్

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్ ఫ్యామిలీకి ఓ ప్ర‌త్యేక‌ గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి స్పూర్తిగా తీసుకొని ఈ ఫ్యామిలీ నుండి నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌న్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్, క‌ళ్యాణ్ దేవ్, వైష్ణ‌వ్ తేజ్, అల్లు శిరీష్‌, నిహారిక ఇలా ఓ క్రికెట్ టీంలా అంద‌రు సినిమా పరిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. వీరంతా మెగా ఫ్యామిలీలా మారి ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని అందిస్తున్నారు. ఇక ఈ మెగా ఫ్యామిలీలో మెగా బ్ర‌ద‌ర్ ఫ్యామిలీ కూడా కాస్త ప్ర‌త్యేకం అనే చెప్పాలి.

Varun Fam | Telugu Rajyam

నాగ‌బాబు అయితే త‌న పిల్ల‌ల‌తో ఓ తండ్రిలా కాకుండా ఫ్రెండ్‌లా ఉంటాడు. నిహారిక అయితే మ‌రీను. పెద్ద పిల్ల అన్న విష‌యం కూడా మ‌ర‌చిపోయి తండ్రి చంక ఎక్కేస్తుంది. వీరి మ‌ధ్య బాండింగ్ అంత‌లా ఉంటుంది. రీసెంట్‌గా నిహారిక వివాహాన్ని నాగ‌బాబు ఘ‌నంగా నిర్వ‌హించ‌గా పెళ్లి ఏర్పాట్ల‌న్నింటిని వ‌రుణ్ తేజ్ చూసుకున్నాడు. నిహారిక పెళ్లి త‌ర్వాత ఫ్యామిలీ అంతా కాస్త కూల్ మూడ్ లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. తాజాగా వ‌రుణ్ తేజ్ త‌న త‌ల్లిని హ‌త్తుకొని సెల్ఫీ తీయ‌గా వారి వెనుక నిహారిక‌, నాగ‌బాబు న‌వ్వుతూ క‌నిపించారు.

మెగా బ్ర‌ద‌ర్ ఫ్యామిలీ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ పిక్ చూస్తుంటే ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్లున్నారు . మ‌రి కొద్ది రోజుల‌లో వ‌రుణ్ తేజ్‌కు కూడా నాగ‌బాబు పెళ్లి చేయాని అనుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఎవ‌ర‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. కెరీర్ విష‌యానికి వ‌స్తే నాగ‌బాబు ప్ర‌స్తుతం అదిరింది షోకు జ‌డ్జిగా ఉన్నాడు. వ‌రుణ్ తేజ్ గ‌ని, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్నాడు. ఇక నిహారిక త‌న హ‌నీమూన్ ట్రిప్ పూర్తి చేసుకొని వ‌చ్చిన వెంట‌నే ఓ వెబ్ సిరీస్ మొద‌లు పెట్టింది. 

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

Latest News