జబర్దస్త్ షోతో నాగబాబు ఎంతలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. కష్టాల్లో కూరుకుపోయి ఉన్న నాగబాబుకు జబర్దస్త్ మళ్లీ ఊపిరిపోసింది. అయితే అదే సమయంలో నాగబాబు ఇమేజ్ జబర్దస్త్‌కు కూడా ఉపయోగపడింది. దాదాపు ఏడేళ్లు జబర్దస్త్‌లో నిర్విరామంగా ఉన్న నాగబాబు డైరెక్టర్ నితిన్ భరత్ కోసం అందులోంచి బయటకు వచ్చేశాడు. ఇక జబర్దస్త్‌ను వీడుతూ నాగబాబు చేసిన కామెంట్స్, ఆరోపణలు ఎంతగా వివాదాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే.

Nagababu About Adirindi And JaBardasth
జబర్దస్త్ నుంచి వచ్చిన నాగబాబు అదిరింది షోను పైకి లేపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కానీ నాగబాబు ఎంత చేస్తున్నా అదిరింది మాత్రం జబర్దస్త్‌కు పోటీగా నిలబడలేకపోతోంది. సరే ఇదంతా కాసేపు పక్కనబెడితే.. నాగబాబు తాజాగా నెటిజన్ల కామెంట్లకు బదులిస్తూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ పాత ఫోటోలను షేర్ చేసిన నాగబాబుకు కామెంట్లలో రూపంలో వింత వింత ప్రశ్నలు ఎదురువుతున్నాయి.

ఆ క్రమంలోనే జబర్దస్త్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మామూలుగా జబర్దస్త్‌లో నాగబాబు నవ్వులు ఎంతో ఫేమస్. అందుకే కదా ఆయన్ను లాఫింగ్ స్టార్ అని కూడా పిలిచేది. అయితే ఓ అభిమాని కామెంట్ చేస్తూ జబర్దస్త్‌లో మీ నవ్వుల్ని మిస్ అవుతున్నాను.. మళ్లీ జబర్దస్త్‌లోకి వస్తారా? అని ప్రశ్నించింది. దానికి స్పందించిన నాగబాబు కూల్ రిప్లై ఇచ్చాడు. అలాంటి అదిరిందిలో కూడా ఉంటుంది.. ఆదివారం రాత్రి 9 గంటలకు వస్తుంది అని నాగబాబు రిప్లై ఇచ్చాడు.

Nagababu About Adirindi And JaBardasth
