ట్రైలర్ టాక్ : “దూత” గా ట్విస్ట్ ఇచ్చిన చైతన్య.!

ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్ కి ఏమంత సరిగ్గా లేని సంగతి అందరికీ తెలిసిందే. థియేటర్స్ లో అన్న తమ్ముళ్లు ఇద్దరు నాగ చైతన్య అలాగే అక్కినేని అఖిల్ కూడా ఫెయిల్ అయ్యారు. కానీ ఈ ఏడాది మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి నాగ చైతన్య తన మొదటి డిజిటల్ డెబ్యూ తో అయితే రాబోతున్నాడు.

తమ ఫామిలీ లో “మనం”, “హలో” లాంటి మంచి చిత్రాలని  విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన సిరీస్ “దూత”. కాగా ఈ సిరీస్ ని ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు ఈరోజు చైతు పుట్టిన రోజు సందర్భంగా దీని తాలూకా ట్రైలర్ ని అయితే లాంచ్ చేశారు. మరి ఈ ట్రైలర్ చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

కానీ మొదట్లో వచ్చిన టాక్ లా అయితే ఇది హారర్ లా లేదు. కంప్లీట్ ఒక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. దీనితో హారర్ అనుకున్న వారికి కొంచెం డిజప్పాయింట్ అని చెప్పాలి. కానీ అయినప్పటికీ దర్శకుడు డిజైన్ చేసిన కథ ఆసక్తిగానే ఉంది.

తాను ఓ క్రైమ్ జర్నలిస్ట్ కాగా తననే ఏదో క్రైమ్ లో ఇరికిస్తే తానేం చేస్తాడు తాను కూడా క్రిమినల్ గా మారడం అలాగే న్యూస్ కార్టూన్ లో వేసేది నిజం కావడం వంటివి ఆసక్తిగా అనిపిస్తున్నాయి. మరి వీటితో ఐతే నాగ చైతన్య మంచి డెబ్యూ ఇచ్చేలానే అనిపిస్తున్నాడు. మరి చూడాలి ఈ డిసెంబర్ 1న వచ్చే సిరీస్ ఏ లెవెల్లో ఉంటుందో అనేది. 
Dhootha - Official Trailer | Naga Chaitanya, Parvathy Thiruvothu, Sathyapriya Bhavani Shankar