Naani : ఎంతో మంది దర్శక నిర్మాతలు నజ్రిమా కోసం ట్రై చేశారు…!మా సినిమాలో చేయడం సంతోషంగా వుంది అంటున్న నానీ..

Naani : నజ్రిమా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా అంటే సుందరానికి… నాని హీరో గా వస్తున్నా ఈ సినిమా కీ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.నజ్రిమా తొలి సినిమా అయినా తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను జూన్ 10న విడుదల చేయాలని చిత్రబృందం ప్రకటించింది.

విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం ఏఎంబీ మాల్‌లో జరిగింది. టీజర్ విడుదల సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ… ఇటీవల తాను నటించిన శ్యామ్ సింగ్ రాయి సినిమా టీజర్ కూడా ఈ మాల్ లోనే జరిగిందని, అది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు మళ్లీ ఇదే మాల్ లో అంటే సుందరానికి చిత్ర టీజర్ కూడా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని, సినిమా విషయం కూడా నాకు తెలిసి పోతోంది అని చెప్పాడు.

ఇలా ప్రేక్షకుల సమక్షంలో తన సినిమా టీజర్ విడుదల చేయడం ఒక సెంటిమెంట్గా మారుతోంది అని చెప్పాడు. ఈ సినిమా అంటే నాకు చాలా ప్రత్యేకం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది అని చెప్పారు. ఇక హీరోయిన్ నజ్రిమా గురించి చెప్తూ.. ఎంతో మంది దర్శక నిర్మాతలు నజ్రిమాను తెలుగు సినిమాలోకి తీసుకు రావాలని ప్రయత్నించినప్పటికీ కుదరలేదు, ఎవరు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసేది కాదు, లిఫ్ట్ చేసిన ఒప్పుకునేది కాదని మా సినిమా కథ చెప్పగానే ఒప్పుకున్నారు అని నాకు చాలా సంతోషంగా వుంది అని చెప్పారు. ఇక పాన్ ఇండియా సినిమాలు అంటే తనకు తెలియదని సినిమా చేస్తే దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకునేలా ఉంటే అదే పాన్ ఇండియా సినిమా అని తెలియజేశారు.