ఎన్టీఆర్ పై క్రేజీ కామెంట్స్ చేసిన “అంటే సుందరానికి” హీరోయిన్..!

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. అయితే ఎన్టీఆర్ కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. మరి ఈ క్రేజ్ కి కారణం మాత్రం తన టాలెంట్ ప్రధాన కారణం అని చెప్పాలి. తన టాలెంట్ తోనే ఎవరిని అయినా మెస్మరైజ్ చెయ్యగలిగే అతి తక్కువమంది స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు. 

అందుకే ఎన్టీఆర్ తో నటన అంటే ఫ్యాషన్ ఉన్న ఎందరో స్టార్ లు నటించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక లేటెస్ట్ గా అయితే ఎన్టీఆర్ పై లేటెస్ట్ టాలీవుడ్ హిట్ “అంటే సుందరానికి” యంగ్ హీరోయిన్ నజ్రియా ఫహద్ కొన్ని క్రేజీ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. 

ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు చెప్పి యాక్ట్ చేస్తారని అడగ్గా ఆమె అయితే ఎన్టీఆర్ తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని ఎన్టీఆర్ గారి పక్కన అయితే నేను బాగుంటాను అనిపిస్తుంది అని తన మనసులో మాట చెప్పింది. దీనితో ఈ క్రేజీ కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ నెక్స్ట్ చేస్తున్న 30వ సినిమాలో ఏదొకలా ఈ హీరోయిన్ ని పెట్టెయ్యండి అంటూ మేకర్స్ కి వారు సూచిస్తున్నారు.