టాలీవుడ్ టైర్ 2 టాప్ హీరోస్ లో ఒకడైన నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికీ”. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం గత శుక్రవారం మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది. అయితే మంచి రివ్యూస్ టాక్ అందుకున్నా కూడా తెలుగు స్టేట్స్ లో మాత్రం అంతంత మాత్రమే వసూళ్లు వస్తున్నాయి.
కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా గట్టెక్కేలా కనిపిస్తుంది. ఇక ఇది పక్కన పెడితే ఈ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు మలయాళం భాషల్లో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఒకేసారి ఈ డబ్బింగ్ పనులను కూడా ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. అయితే మన తెలుగులోనే ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టడం లేదు.
ఇక ఆ రెండు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ఊసే లేదని చెప్పాలి. అసలు అక్కడ వసూళ్ల కోసం కూడా ఎవరూ మాట్లాడ్డం లేదు. కనీసం రెండు భాషల్లో డబ్బింగ్ ఖర్చులు అయినా వచ్చాయో లేదో కానీ అక్కడైతే ఈ సినిమా గల్లంతైపోయింది అని చెప్పక తప్పదు. అయితే ఈ రిలీజ్ లతో ముందు ముందు నాని మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఉంది. కానీ ఈ సినిమా మాత్రం అక్కడ ప్లాప్ గానే నిలిచిపోయింది అని చెప్పక తప్పదు.