Mytri Movie Makers: మైత్రీ డబుల్ ట్రీట్: హిట్ అయితే లాభాల వర్షం

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి డబుల్ ధమాకాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. ఈసారి కోలీవుడ్ స్టార్ అజిత్‌ నటించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ “జాట్” చిత్రాలను ఏకకాలంలో ఏప్రిల్ 10న విడుదల చేయనుంది. రెండు సినిమాలపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

గతంలో సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి “వాల్తేరు వీరయ్య” మరియు బాలకృష్ణ “వీరసింహారెడ్డి” చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మైత్రీ, అదే ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతోంది. అజిత్ చివరగా నటించిన “విడామయూర్చి” నిరాశ పరచినప్పటికీ, గుడ్ బ్యాడ్ అగ్లీపై భారీ అంచనాలున్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే వారం రోజుల్లోనే రూ.100 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జాట్” మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇటీవల గదర్ 2 తో సన్నీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నందున ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఘన విజయాన్ని సాధిస్తుందనే విశ్వాసం ఉంది. హిందీలో మూవీ క్లిక్ అయితే రూ.100 కోట్లకు పైగా లాభాలు రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి, మైత్రీ ఈ రెండు సినిమాలను ఒకేరోజు రిలీజ్ చేసి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని భావిస్తోంది. రెండు సినిమాలు హిట్ అయితే, మైత్రీ మరోసారి భారీ లాభాలను అందుకోవడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏప్రిల్ 10న ఈ రిస్క్ తో మైత్రీకి లాభాల వర్షం కురిపిస్తుందా లేదా చూడాలి.

చట్టసభల్లో నిరుద్యోగుల గళం వినిపిస్తా, ప్రభుత్వాన్నిప్రశ్నిస్తా | MLC Candidate Prasanna Harikrishna