Akhanda 2: అఖండ యూనివర్స్‌లో మరో స్టార్ ఎంట్రీ.. మాస్ ఫెస్టివల్ రెడీ?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2 – తాండవం’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ ఎంటర్టైనర్‌గా బోయపాటి స్పెషల్ ట్రీట్ సిద్ధం చేస్తున్న ఈ సినిమా సెట్స్‌పై నుంచి నిత్యం కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ హాట్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ ‘అఖండ 2’లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. అయితే ఇది గెస్ట్ రోల్ మాత్రమేనని, కొన్ని కీలక సన్నివేశాల్లో సందడి చేయబోతున్నారని టాక్. సన్నీ డియోల్ పాత్ర మాత్రం అఖండ యూనివర్స్‌లో మూడో భాగానికి కీలకమైన మార్గాన్ని చూపించబోతోందని సమాచారం.

ప్రస్తుతం బాలయ్య సినిమా కొత్త షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. అక్కడే సన్నీ డియోల్ గెస్ట్ రోల్ షూటింగ్ జరగనుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవలి కాలంలో ‘జాట్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయగర్జన చేసిన సన్నీ డియోల్, ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఆడియెన్స్‌ని కూడా మళ్ళీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.

మొత్తానికి బాలయ్య పవర్, బోయపాటి మాస్ మేనియా, సన్నీ డియోల్ గెస్ట్ సర్ప్రైజ్ కలిసి ‘అఖండ 2’ సినిమాకు అదనపు మాస్ మసాలా జోడించబోతున్నాయి. ఈ కాంబినేషన్ ఎలా అలరిస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు రానుందో వేచి చూడాలి.

లక్ష పుస్తకాల అజ్ఞాని || Jada Sravan Kumar Fires On Pawan Kalyan || Chandrababu || Telugu Rajyam