“హనుమాన్” డిస్ట్రిబ్యూటర్స్ కి షాకిచ్చిన మైత్రి సంస్థ..!

ఇపుడు ఇండియా వైడ్ గా కూడా మరోసారి ఓ తెలుగు సినిమా పేరు మారు మోగుతుంది. ఆ సినిమానే “హనుమాన్”. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో చాలా చిన్న హీరో తేజ సజ్జ నటించాడు. వారు అనుకున్న దానికంటే ఈ చిత్రం ఇప్పుడు ఊహించని వండర్స్ సెట్ చెయ్యడం మొదలు పెడుతుంది.

దీనితో హనుమాన్ వసూళ్లు చేస్తున్న నంబర్స్ కానీ తెలుగు రాష్ట్రాల్లో హిందీలో యూఎస్ లో కూడా పెడుతున్న బుకింగ్స్ కానీ ఒకొకరికి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. మెయిన్ గా తెలంగాణ ప్రాంతంలో హనుమాన్ బుకింగ్స్ ఫుల్ ఫైర్ లో ఉన్నాయి. రెండో రోజు ఇప్పుడుకి ఉన్న కొత్త సినిమాలు ఏది కూడా అందుకోని ఫీట్ ని హనుమాన్ సాధించింది.

హైదరాబాద్ సిటీలో హనుమాన్ ఎన్ని షోస్ ఉన్నాయో అన్నీ హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఈ మార్క్ గుంటూరు కారం కే కాదు ఏ ఇతర కొత్త సినిమాకి కూడా సాధ్యపడలేదు. మరి ఇంతలా వండర్స్ సెట్ చేస్తున్న హనుమాన్ చిత్రంపై ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

తెలంగాణ ప్రాంతంలో హనుమాన్ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాగా ఆ మేరకు చాలా థియేటర్స్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ హనుమాన్ ని వేయాల్సిందిగా అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ చాలా మంది అలా చేయకుండా అగ్రిమెంట్ ని ఉల్లంఘించారని తెలిపారు.

అందుకే తమకి వచ్చిన నష్టాన్ని వారు చెల్లించడమే కాకుండా తక్షణమే హనుమాన్ సినిమాని ప్రదర్శన కూడా వేయాలని తెలుగు సినిమా నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేశారు. దీనితో ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నోటీసులు వెళ్లినట్టుగా తెలుస్తుంది. మరి ఇంత బాగా వసూళ్లు వస్తున్నా హనుమాన్ ని వదిలేసి వారేం చేస్తున్నారో వారికే తెలియాలి.