బిగ్ అప్డేట్ : “విశ్వంభర” తో సంక్రాంతి పోటీ స్టార్ట్ చేసిన మెగాస్టార్ 

టాలీవుడ్ మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గత చిత్రం భోళా శంకర్ భారీ ప్లాప్ అయ్యింది. దీనితో మెగాస్టార్ నుంచి ఓ భారీ కం బ్యాక్ కోసం అందులోని మరీ ముఖ్యంగా రీమేక్ సినిమాలు అసలే వద్దు అని మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు అప్పుడు యంగ్ దర్శకుడు వశిష్టకి మెగాస్టార్ అవకాశం ఇచ్చారు అనే వార్త బయటకి వచ్చింది.

కొత్త దర్శకుడు అందులోని స్ట్రైట్ సినిమా ఇంకా పెద్ద విషయం ఏమిటంటే మళ్ళీ వింటేజ్ చిరు చేసిన భారీ ఫాంటసీ డ్రామా అనే మాట ఓ రేంజ్ లో ఆసక్తి రేపింది. మరి అలా అనౌన్స్ చేసిన భారీ చిత్రమే “విశ్వంభర”. గ్రాండ్ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ కేటాయించి అనౌన్స్ చేసిన ఈ చిత్రం కోసం మెగాస్టార్ తన స్వేదం ఈ వయసులో కూడా చిందిస్తూ ఉండడం క్రేజీ అంశంగా మారింది.

కాగా ఇప్పుడు మరో భారీ అప్డేట్ ని చిత్ర యూనిట్ అందించారు. కాగా ఈరోజు నుచి చిరు సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు అని ఒక అప్డేట్ ఇవ్వగా మరో అప్డేట్ కూడా అందించారు. దీనితో ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదల అవుతున్నట్టుగా తెలియజేసారు.

దీనితో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మొట్ట మొదటి సినిమాగా మెగాస్టార్ తన సినిమానే అనౌన్స్ చేసి అప్పుడే 2025 సంక్రాంతికి సై అన్నారు. మొత్తానికి అయితే ఫస్ట్ సినిమా తానే అనౌన్స్ చేశారు కాబట్టి మరో సినిమా ఆ డేట్ కి లాక్ చేసే ఛాన్స్ లేదు అలాగే ఈ సినిమా వెనక్కి లేదా ముందుకు వెళ్లే ఛాన్స్ అంతకన్నా లేదు. ఇక ముందు ఏ చిత్రాలు సంక్రాంతి రేస్ లో నిలుస్తాయి అనేది చూడాలి.