లేటెస్ట్ : “మెగాస్టార్ 156” నుంచి రెండు బిగ్ అప్డేట్స్ 

టాలీవుడ్ సినిమా మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండు సినిమాలు గత ఏడాదిలో వచ్చి ఒకటి భారీ లాభాలు అందిస్తే ఒకటి మాత్రం దారుణమైన నష్టాలు మిగిల్చింది. దీనితో తేరుకున్న మెగాస్టార్ ఎట్టకేలకి స్ట్రైట్ సినిమానే తీయాలని డిసైడ్ అయ్యి చేస్తున్న సినిమానే “విశ్వంభర”.

కాగా ఈ చిత్రం దర్శకుడు బింబిసార ఫేమ్ వసిష్ఠ మల్లాది తెరకెక్కిస్తుండగా మెగాస్టార్ కెరీర్ లో ఇది 156వ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో మళ్ళీ మెగాస్టార్ నుంచి ఎన్నో ఏళ్ళు తర్వాత చేస్తున్న ఓ భారీ ఫాంటసీ వండర్ గా ప్లాన్ చేస్తుండగా మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఈ సినిమా పట్ల ఉన్నారు.

కాగా ఇపుడు ఈ సినిమాపై మేకర్స్ పండుగ కానుకగా క్రేజీ అప్డేట్ ని అందించారు. రేపు సంక్రాంతి కానుకగా అయితే ఈ సినిమా రాబోతున్నట్లు ఇప్పుడు రివీల్ చేశారు. దీనితో రేపు సాయంత్రం 5 గంటలకి సినిమా టైటిల్ ఏంటి అనేది అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. కాగా ఆల్రెడీ ఈ చిత్రానికి “విశ్వంభర” అనే టైటిల్ ని పెట్టినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.

కానీ అఫీషియల్ గా ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. కాగా ఈ టైటిల్ ని ఎలాంటి పోస్టర్ తో రిలీజ్ చేస్తారు అనేది ఆసక్తిగా మారగా మరో అప్డేట్ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది కూడా రివీల్ చేయనున్నారు అని రూమర్స్ ఉన్నాయి. మరి చూడాలి రేపు ఒకటే రివీల్ చేస్తారా లేదా రెండు రివీల్ చేస్తారా అనేది. ఇంకా ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.