వైరల్ వీడియో : ‘విశ్వంభర’ కి బాస్ కష్టం చూసి సలాం కొడుతున్న నెటిజన్స్ 

టాలీవుడ్ మాస్ మూల విరాట్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అశేష ఆదరణ ఏ పాటిదో తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ తన స్వశక్తితో ఇంత ఆదరణని అందుకున్నారు. కాగా ఎందుకు చిరుకి ఇంత ఆదరణ ఎందుకు ఇంత ప్రేమ అంటే అందుకు చాలా కారణాలే ఉంటాయి.

ఇప్పుడు వారికి మరో కారణం దొరికింది అని చూడ చెప్పొచ్చు. అసలు మెగాస్టార్ అంటేనే “కష్టం”. ఆ కష్టం తోనే ఎన్నో సినిమాల్లో శ్రమించి ఇంత పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తనకు సుమారుగా 70 ఏళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు కూడా తన నెక్స్ట్ సినిమా కోసం ఓ రేంజ్ లో జిమ్ లో కష్టపడుతున్నారు.

ఇక ఈ ఏజ్ లో కూడా చిరు ఇంతలా కష్టపడుతుడడం చూసి మెగా ఫ్యాన్స్ మాత్రం మురిసిపోతున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ గా రీసెంట్ టైం లో బాస్ ఏ చిత్రానికి కూడా ఈ తరహాలో కష్టపడింది లేదు. ఆ మధ్య ఎప్పుడో సైరా నరసింహా రెడ్డి చిత్రానికి కష్టపడినట్టుగా గుర్తు.

మళ్ళీ ఈ చిత్రానికి ఇంత కష్టపడుతుండడంతో అయితే ప్రెజెంట్ జెనరేషన్ యూత్ చిరు వీడియో పోస్ట్ కి కింద కామెంట్స్ లో మరింత గౌరవం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం బాస్ తన డెడికేషన్ తో నెటిజన్స్ ని మెగా ఫ్యాన్స్ కి కట్టిపడేసారు అని చెప్పాలి. ఇంకా ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు వసిష్ఠ తెరకెక్కిస్తున్నాడు అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.