Singer Chinmayi: సింగర్‌గా, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అగ్ర తారలకు డబ్బింగ్ చెప్పి ఎంతో పేరును సంపాదించుకున్నారు చిన్మయి శ్రీపాద. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించినా, ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. కాగా ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. తాను సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులను మీ టూ ఉద్యమం ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేయడంతో, ఆ తర్వాత ఎంతో మంది సెలబ్రెటీలు ముందుకొచ్చి వారికి ఎదురైన ఇబ్బందులు పంచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారందరికీ ఈమె ఒక స్ఫూర్తిగా నిలిచారనే చెప్పవచ్చు. అప్పటి నుంచి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అందరికీ తెలిసేలా చాటి చెప్పేందుకు ఆమె సోషయా మీడియాను ఫ్లాట్ ఫాంగా ఎంచుకుంది.
సామాజిక మాధ్యమాల ద్వారా మహిళా వేధింపులు, సమస్యలను, ఎదుర్కొన్న సన్నివేశాలను చిన్మయి బహిర్గతం చేయడంలో ముందుంటూ పలువురి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతే కాకుండా వారికి కావల్సిన సూచనలు, సలహాలను కూడా ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అలా చేసిన పోస్టులకు కొంత మంది కాంట్రవర్సీగా క్రియేట్ చేస్తే, మరికొంత మంది మాత్రం ఆమె మద్దతునిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
రోజురోజుకూ మహిళలపై వేధింపులు ఎక్కువవుతూనే ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలన్న దానిపై చాలా మంది సరైన అవగాహన కూడా ఉండడం లేదు. నిజానికి అలాంటి అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి విషయాలపై చిన్మయితో చర్చించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అలా ఆమెకు వచ్చే ఫోన్ల సంఖ్య కూడా పెరిగింది. మరికొందరు ఆమె తల్లికి ఫోన్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన చిన్మయి వృత్తిపరంగానీ, వ్యక్తి గతంగా గానీ ఎవరైనా తనతో మాట్లాడాలనుకుంటే నేరుగా మా మేనేజర్‌కు కాల్ చేయండి. అంతే గానీ మా అమ్మకు ఫోన్ చేసి ఆమెను ఇబ్బంది పెట్టకండి, నేను సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు, ఆమెకు ఎలాంటి సంబంధమూ లేదని, ఆమెమీ తన స్పోక్ పర్సన్ కాదని పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.