మరణాంతరం నాన్న సమాధి పక్కనే నా సమాధి ఉండాలి.. ప్రశాంత్ నీల్ ఎమోషనల్ కామెంట్స్?

Prashanth Neel about doing movies with Telugu stars

కేజిఎఫ్ వంటి కన్నడ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ డైరెక్టర్ అయినప్పటికీ ఈయన మాత్రం తెలుగు ఆయనే అనే విషయం అందరికీ తెలిసిందే. ఈయన స్వస్థలం మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం అనే విషయం మనకు తెలిసిందే. ప్రశాంత్ నీల్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డికి స్వయాన అన్నకుమారుడు.ఇకపోతే 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నీలకంఠాపురంలో ప్రశాంత్ నీల్ సందడి చేశారు.

అదే రోజే తన తండ్రి సుభాష్ రెడ్డి 75వ జయంతి వేడుకలు కావడంతో ఈ సందర్భంగా ఆయన నీలకంఠాపురంలోని తన తండ్రి సమాధిని దర్శించుకున్నారు.ఇక నీలకంఠాపురంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రశాంత్ నీల్ అనంతరం నీలకంఠాపురంలో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ… తాను ఎంత గొప్ప డైరెక్టర్ అయినప్పటికీ నా స్వస్థలం ఇదే నేను మరణించిన తర్వాత నా సమాధి కూడా మా నాన్న సమాధి పక్కనే ఉంటుంది అంటూ ఈయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే మా నాన్న జయంతి కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ప్రస్తుతం తాను ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక వచ్చే నెలలో ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.