సలార్ తో అసంతృప్తి చెందిన ప్రశాంత్ నీల్.. కారణమీదేనా!

సలార్ సినిమా గత సంవత్సరం డిసెంబర్ 23న విడుదల అయింది. అప్పటికే రాధేశ్యాం, ఆదిపురుష్ లతో వెనుక పడిన ప్రభాస్ కు సలార్ సినిమా ఒక మంచి కం బ్యాక్ లా వచ్చింది. ఫ్యాన్స్ అందరి ఆకలి తీర్చిన సలార్ సినిమా విడుదల అయ్యి మొన్నటితో సంవత్సరం గడిచింది. అయితే ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ తో ఒక ఇంటర్వ్యూ ని విడుదల చేసింది సినిమా టీం.

ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సలార్ సినిమా మంచి ప్రొడక్షన్స్ తో తీశాను కానీ అది అనుకున్నంత కలెక్షన్లు సాధించలేదు దానిమీద నిరాశ చెందాను అంటూ చెప్పుకొచ్చారు. అందరూ కే జి ఎఫ్ 2 లా ఉంది అని పోల్చారు కానీ దానికన్నా మంచి ప్రొడక్షన్లతో సినిమా తీద్దాం అనుకున్నాను అక్కడ నేను విఫలమయ్యాను. సలార్ 2 సినిమా మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, ఈ సినిమా నాకు బెస్ట్ రైటింగ్ ద బెస్ట్ మూవీ గా నిలుస్తుంది అని నేను కచ్చితంగా చెప్తాను.

నేను రాసేది నా ఊహకే కాదు ప్రేక్షకులందరి ఊహకి అందనంత బాగా తీస్తాను అని బల్ల గుద్ది చెప్పారు. ఇప్పటికే సలార్ సినిమాకు ఎందరో ఫాన్స్ ఉండగా అంతకన్నా మంచిగా సలార్ 2 రాబోతుంది అన్న విషయం తెలియగానే ఫ్యాన్స్ అందరూ సంతోషంతో ఊరేగుతున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ డేట్స్ అయితే కాళీగా లేవు.

మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అవగానే హను రాఘవపూడి తో ఒక లవ్ స్టోరీ, అలాగే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీలో కూడా ప్రభాస్ నటించనున్నారు. ఇన్ని ప్రాజెక్టులు చేతిలో పెట్టుకున్న ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సలార్ టు ప్రస్తుతం వర్కింగ్ స్టేజ్ లో ఉంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది ఇదిలా ఉండగా వచ్చే సంవత్సరం రాజా సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ప్రభాస్.