ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి అస్వస్థత… ఆస్పత్రిలో చేరిక!

ప్రముఖ సినీ గేయ రచయితగా ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాటలు రాసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన పాటలు ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఇతనిని హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

రెండు రోజుల నుంచి కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఈయన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అసలు ఏమైందనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు వెల్లడించాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఆయనకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడాలని ఎంతో మంది అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

ఇక సీతారామశాస్త్రి విషయానికి వస్తే 1986లో సిరివెన్నెల అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక తన మొదటి చిత్రమే తన ఇంటిపేరుగా మారి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో పాటలు రాసినందుకుగా ఈయనకు ఉత్తమ లిరిసిస్ట్ గా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఈయన 100 సినిమాలకు పైగా పాటలు రాసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం పాలయ్యారని తెలియడంతో ఎంతోమంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు.