ఎంఎస్ రాజు చిత్రాలంటే ఒకప్పుడు వెండితెరపై రికార్డులు సృష్టించాయి. ఆయన పేరు, సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరు కనిపిస్తే చాలు సినిమా హిట్ అనే భావం ఉండేది. దేవీ, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, ఒక్కడు ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్‌లు అందించాడు. శత్రువు, దేవీ సినిమాలు ఎంఎస్ రాజును నిర్మాతగా నిలబెడితే ఓ చిత్రం మాత్రం కుప్పకూలేలా చేసిందంట.
శత్రువు, దేవీ సినిమాలు ఇచ్చిన కాన్ఫిడెంట్‌తో దేవీ పుత్రుడు సినిమాను అత్యంత భారీ ఎత్తున నిర్మించాడట. ఆ సినిమాకు అంత బడ్జెట్ ఎందుకుని ఎంతో మంది వారించారట. అయితే ఈ సినిమా వల్ల ఎంఎస్ రాజు ఏకంగా 14 కోట్లు పోగొట్టుకున్నాడట. అప్పటి వరకు ఎన్ని ఫ్లాపులు చూసినా, వచ్చినా కూడా ఏమీ అనిపించలేదు కానీ దేవీ పుత్రుడు ఫ్లాప్ అవ్వడంతో కోలుకోలేకపోయాడట.
మళ్లీ తాను నిలబడేందుకు కొత్త కథను, చిన్న బడ్జెట్‌లో తీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడట. అందులో భాగంగానే తనకు వచ్చిన ఓ చిన్న ఐడియాను పరుచూరి బ్రదర్స్‌తో పంచుకున్నానని అలా మొదలైందే మనసంతా నువ్వే చిత్రమని ఎంఎస్ రాజు చెప్పుకొచ్చాడట. మనసంతా నువ్వే చిత్రం దేవీ పుత్రుడు మిగిల్చిన నష్టాలన్నీ పూరించేసిందట. నేడు మనసంతా నువ్వే విడుదలై 19 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎంఎస్ రాజు ఎమోషనల్ అయ్యాడు.