సినిమాలు నిల్, సంపాదన మాత్రం ఫుల్.. ఆశ్చర్యపరుస్తున్న జెనీలియా ఆస్తుల విలువ!

హ..హ.. హసిని గా మనందరినీ పలకరించిన అల్లరి పిల్ల జెనీలియా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాయ్స్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన జెనీలియా తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అవ్వటంతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలని అందుకుంది.

ఈమె నటించిన బొమ్మరిల్లు సినిమా ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందంటే హాసిని అంటే తమ ఇంటి పిల్ల అన్నట్లుగా గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ పీక్ లో ఉండగానే ఈమె బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకి దూరమైన ఈ ముద్దుగుమ్మ కి ప్రస్తుతం ఇద్దరూ మగ పిల్లలు. ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న జెనీలియా ఆస్తుల విషయానికి వస్తే పెద్ద మొత్తంలోనే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం ఈ అమ్మడి ఆస్తులు దాదాపు 6 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 50 కోట్లు పైనే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఈమె సినిమాలకు దూరంగా ఉంది కానీ సంపాదన మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే ఈమె చాలా బ్రాండ్స్ కి అంబాసిడర్.

అలాగే ఈ దంపతులకి ముంబై ఫిలిం కంపెనీ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది, అలాగే వీరిద్దరికీ ప్లాంట్ బెస్ట్ కంపెనీ కూడా ఉంది ఆ కంపెనీ పేరు ఇమేజిన్ మీట్స్. అలా జెనీలియా సినిమాల ద్వారా కాకపోయినా ఇలా వ్యాపారాల ద్వారా సంపాదిస్తోంది. అంతేకాకుండా తన భర్త రితేష్ దేశ్ ముఖ్ ఆస్తులతో కలిపితే వీరి ఆస్తి 22 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది. ఆమె వద్ద బెంట్లీ కాంటినెంటల్, టెస్ట్ల మోడల్ ఎక్స్ 20 ఖరీదైన కార్లు ఉన్నాయి.