సినీ జనాలకి కోపం ఎక్కవవుతోంది. అదే సమయంలో సినీ జర్నలిస్టుల ముసుగులో చిల్లరతనం కూడా ఎక్కువైపోయింది.
పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం, తద్వారా పాపులరవడం కొంతమంది ఎర్నలిస్టులకి నిత్యకృత్యమైపోయింది. అదో ఫ్యాషన్ కూడా అయిపోయిందనొచ్చేమో.
తాజాగా ఇంటర్వ్యూల పేరుతో ఓ ఎర్నలిస్టు బ్లాక్ మెయిలింగ్‌కి పాల్పడుతున్నాడంటూ రచ్చ జరుగుతోంది. తనదైన పిచ్చి ప్రశ్నలతో తెగ పాపులర్ అవుతున్నాడీ ఎర్నలిస్టు.
ఈ పాపులారిటీ పిచ్చ ఎంత దూరం వెళ్లిందంటే, ఈ మధ్యనే ఓ డైరెక్టర్‌ని ఇంటర్వ్యూలో రెచ్చగొట్టాడతను. ఎందుకంతలా రెచ్చగొట్టాడా.? అని ఆరా తీస్తే కొట్టించుకోవాలనే తపనతోనే అదంతా చేశాడనీ తెలిసింది.
అంటే దానర్ధం.. ఇంకేముంది. ట్రెండింగ్ అయిపోవడమే. ఇప్పుడు కొట్టించుకోవడం ట్రెండింగ్ అవ్వబోతోందన్న మాట. ఎవరి పైత్యం వాళ్లకి ఆనందం. ఈ పైత్యంతోనే సదరు ఎర్నలిస్టు ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయాడు.
కాదు కాదు, పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. కొందరు సెలబ్రిటీ అయిపోడంటుంటే, ఇంకొందరేమో, వీడి పైత్యం పరాకాష్టకు చేరిందంటూ రకరకరాలుగా విమర్శనాస్ర్రాలు విసురుతున్నారు.
ఎవరెలా నవ్వితే నాకేటి సిగ్గు.. నేను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతానంతే..! అనుకుంటున్నాడీ ఎర్నలిస్టు. ఎన్ని చీవాట్లు వచ్చినా, సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా అస్సలు పట్టించుకోవడం లేదు. సరికదా.. ఇదీ ఓ పబ్లిసిటీనే ఫ్రీ పబ్లిసిటీ.. అని మరింత రెచ్చిపోతున్నాడు.