క్రేజీ.. జపాన్లో RRR కి క్రేజ్ ఇంకా పెరిగిందట..!

1121107-rrr

ప్రస్తుతం ప్రపంచ సినిమా దగ్గర సెన్సేషన్ గా వైరల్ అవుతున్న ఏకైక తెలుగు సహా ఇండియన్ సినిమా పేరు “ఆర్ ఆర్ ఆర్”. ఇండియన్ సినిమా దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటించారు. ఇక వీరితో తీసిన ఈ భారీ ఆక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గత కొన్ని నెలల కితమే జపాన్ దేశంలో రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.

మరి జపాన్ లో ఈ చిత్రం ఆల్రెడీ ఆల్ టైం ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా భారీ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా అక్కడ నిలిచింది. మరి అక్కడితో అయితే ఈ సినిమా రన్ అయిపోలేదట. ఇప్పుడు 60 రోజులకి చేరిన ఈ సినిమా ఇంకా హవా కంటిన్యూ చేస్తుందట. అంతే కాకుండా ఇప్పుడు జపాన్ లో ఈ చిత్రానికి మరిన్ని స్క్రీన్ లు అక్కడ కేటాయిస్తున్నారట.

ఇప్పటివరకు 3 లక్షల 23 వేల 211 టికెట్స్ జపాన్ లో తెగినట్టుగా మేకర్స్ తెలిపారు. దీనితో ఈ సినిమా సెన్సేషన్ జపాన్ లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, నటి ఆలియా భట్ తదితరులు నటించగా డీవీవీ దానయ్య భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మాణం వహించారు.