Home News bigg boss 4 Telugu : నేను అఖిల్‌కు అది ఇవ్వ‌నందుకే నామినేట్ చేశాడు.. మాస్ట‌ర్‌తో...

bigg boss 4 Telugu : నేను అఖిల్‌కు అది ఇవ్వ‌నందుకే నామినేట్ చేశాడు.. మాస్ట‌ర్‌తో అస‌లు విష‌యం చెప్పిన మోనాల్

శ‌నివారం నోయ‌ల్ మొద‌లు పెట్టిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజ‌శేఖ‌ర్ మాస్టర్, అవినాష్‌లది చిల్ల‌ర కామెడీ అని నోయ‌ల్ అన‌డంతో వీరిద్ద‌రు చిచ్చుబుడ్డిలా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారు. నోయ‌ల్‌పై మాట‌ల దాడి చేశారు. ఆ స‌మ‌యంలో అభిజిత్ క‌ల్పించుకోవ‌డంతో అవినాష్ ఆ కార‌ణం చెప్పి సోమవారం రోజు అభిని నామినేట్ చేశాడు. అదే ఇష్యూ అభిజిత్ నామినేట్ చేసే స‌మ‌యంలోను కొన‌సాగ‌గా, ఇద్ద‌రు కొట్టుకునే పరిస్థితి వ‌ర‌కు వెళ్ళారు. సోమ‌వారం రోజు జ‌రిగిన నామినేష‌న్‌లో అరియానా.. నోయ‌ల్‌, హారిక‌ల‌ని నామినేట్ చేయ‌గా అవినాష్‌.. అభిజిత్, హారిక‌ని నామినేట్ చేశాడు. ఇక సోహైల్‌.. అభిజిత్, మోనాల్‌ల త‌ల‌పై గుడ్డు ప‌గ‌లగొట్టాడు.

Monal Akhil | Telugu Rajyam

ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ మంచి రంజుగా సాగుతుంది. డే వ‌న్ నుండి ఇంట్లో క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్న అఖిల్‌, మోనాల్‌లు ఏడో వారంలో నామినేష‌న్‌లో ఎదురెదురు ప‌డ్డారు. అప్పుడు అఖిల్ నీ క‌న్నా ఆట బాగా నేను ఆడ‌తా కాబ‌ట్టి నువ్వు నామినేష‌న్‌కు వెళ్లు అన్నాడు. అప్ప‌డు రీజ‌న్ స‌రైందే అని మోనాల్ నామినేష‌న్‌లోకి వెళ్ళింది . కాని ఈ వారం అఖిల్‌.. మోనాల్ త‌ల‌పై గుడ్డు ప‌గ‌ల‌గొట్టి నామినేట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఈ స‌న్నివేశం ఇంటి స‌భ్యుల‌కే కాదు బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కి పెద్ద షాక్ ఇచ్చింది. అమ్మ రాజ‌శేఖ‌ర్ అయితే నోరెళ్ళ పెట్టి ఇదేంట్రా వాడు మోనాల్‌ని నామినేట్ చేశాడ‌ని అవినాష్‌తో అన్నాడు.

అయితే అఖిల్ నామినేట్ చేయ‌డంతో బాధ‌తో మాస్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన మోనాల్ కన్నీళ్ళు పెట్టుకుంది. నిన్ను అలా ఎలా నామినేట్ చేశాడు అని అగ్నికి ఆజ్యం పోసేలా మాస్ట‌ర్.. మోనాల్‌ని అడ‌డ‌గా, ఆమె స్పందిస్తూ..అమ్మాయి-అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాలేరు.. కొంచెం మోర్ కావాలి?? ఆ మోర్‌ అఖిల్‌కు ఇవ్వ‌లేదు క‌దా! అదే ప్రాబ్లమ్’ అని చెప్పుకొచ్చింది. అంటే అఖిల్ మోనాల్ ద‌గ్గ‌ర ఏం ఆశించాడు? మోనాల్ ఏం ఇవ్వ‌లేదు అనేది ఇప్పుడు అంత‌టా ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే మోనాల్ ప‌రిస్థితిని చూసి జాలిప‌డ్డ మాస్ట‌ర్ ‘నువ్వు ఉండే వ‌ర‌కూ నేను నీకు స‌పోర్ట్‌గా ఉంటా ‘అని మోనాల్ చేయి ప‌ట్టుకుని ధైర్యం చెప్పాడు. అంతేకాదుఅవినాష్‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, మోనాల్ అంద‌రు ఓ టీమ్‌గా జ‌ట్టు క‌ట్టారు . అస‌లు హౌజ్‌లో ఏం జ‌రుగుతుంది అనే దానిపై నేడు క్లారిటీ రానుంది

 

- Advertisement -

Related Posts

ఇంత అనుభవం పెట్టుకొని చంద్రబాబు ఇలాంటి తప్పు చేశాడేంటి?? టీడీపీ నాయకులే తల పట్టుకున్నారు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. దాదాపు పతనావస్థకు చేరువలో ఉంది. ఇంకొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగు అయ్యే అవకాశం ఉన్న సందర్భంలో...

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

Latest News