అదృష్టం కొద్దీ అభిజిత్ గెలిచాడట.. మంట పెట్టేసిన మోనాల్

Monal says Abhijeet wins by luck

బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకు ఒకరకమైన మోనాల్‌ను చూస్తే.. బయటకు వచ్చాక మరో రకమైన మోనాల్‌ను చూస్తున్నట్టుంది. బయటకు వచ్చాక తన పరిస్థితి తాను ఏ స్థానంలో ఉందో తెలుసుకుంది. తన మీద జరుగుతున్న ట్రోలింగ్, తన ఇమేజ్ ఎంతలా పడిపోయిందో కూడా చూసుకుంది. అఖిల్ మోనాల్ ట్రాక్‌పై జనాల అభిప్రాయాన్ని తెలుసుకుంది. అభిజిత్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా చూసింది. అలా చివరి సమయంలో ఎక్కడా కూడా అభిజిత్‌కు సపోర్ట్ చేయకుండా అఖిలే నెంబర్ వన్ అంటూ తెగ ఊగిపోయింది. అఖిల్ గెలుస్తాడనే నమ్మకంతో మోనాల్ ఉంది.

Monal says Abhijeet wins by luck

కానీ చివరకు ఓట్ల పరంగా అఖిల్ మూడో స్థానానికే పరిమితమయ్యాడు. కానీ సోహెల్ 25 లక్షలు తీసుకోవడంతో అఖిల్ రన్నర్‌గా వచ్చాడు. అభిజిత్ చివరకు టైటిల్ గెలిచాడు. ప్రతీసారి అన్నట్టుగానే ఈ సారి కూడా మీరు కప్ గెలిస్తే.. మా వాళ్లు హృదయాలను గెలిచారు అని నినాదాన్ని పైకి ఎత్తారు. కానీ అఖిల్ మీద ఎంతటి ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. ఏ లెక్కన చూసినా కూడా సోహెల్, అభిజిత్‌లే హైలెట్ అయ్యారు. చివరకు నిజంగానే అఖిల్ కరివేపాకులా మిగిలిపోయాడు.

అయితే ఇంత జరిగినా కూడా మోనాల్ మాత్రం తన వ్యవహార శైలి మార్చుకోవడం లేదు. అభిజిత్ అదృష్టం కొద్దీ విన్ అయ్యాడంటూ చెప్పుకొచ్చింది. అభిజిత్ కప్ గెలిస్తే అఖిల్ హృదయాలను గెలిచాడని తల తిక్క యాంకర్ అంటే.. అవునని మోనాల్ కూడా వంత పాడింది. కొన్ని కొన్ని సార్లు లక్, టైం అన్నీ కలిసి వస్తాయని అలా అన్నీ కలిసి అభిజిత్‌ను విన్నర్‌ను చేశాయని మోనాల్ చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న అభిజిత్ నిజమా? లేదా బయట ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న అభిజిత్ నిజమా? అన్నది నాకు తెలియడం లేదని మోనాల్ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇప్పుడు మోనాల్ కామెంట్ల మీద మరోసారి చిచ్చు రేగింది.