బిగ్ బాస్ హౌస్ నుండి మోనాల్ ఎలిమినేటెడ్ ! టైటిల్ కోసం ఆ ఐదుగురు మధ్యనే పోటీ!

బిగ్ బాస్ సీజన్ 4 ఆఖరి వారంలోకి అడుగుపెడుతోంది. రేపటి నుంచి ఫినాలే వీక్ మొదలవుతుంది. బిగ్ బాస్ టైటిల్ కోసం అఖిల్, అభిజీత్, సోహెల్, అరియానా, హారిక పోటీపడనున్నారు. వచ్చే ఆదివారం బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరో తెలిసిపోనుంది. ఇదిలా ఉంటే, ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ సన్‌డేను కూడా నాగార్జున ఫన్‌డేగా మార్చారు. ఇంటి సభ్యులతో ఆటలు ఆడిస్తూనే ఒక్కో ఫైనలిస్ట్‌ను రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి అరియానా, మోనల్ మిగిలారు. వీరిద్దరిలో మోనల్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.

Monal Eliminated From The Bigg Boss House
monal eliminated from the bigg boss house

చివరిగా అరియానా, మోనల్ మిగలడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో తాను ప్రకటించలేనని.. అందుకే బిగ్ బాస్ సహాయం తీసుకుంటున్నానని చెప్పిన నాగార్జున వేదికపైకి ఒక ప్రింటర్ తెప్పించుకున్నారు. ఈ ప్రింటర్‌లో ఫైనలిస్ట్ ఎవరో ప్రింట్ వస్తుందని.. మిగిలిన హౌస్‌మేట్ ఎలిమినేట్ అయినట్టని నాగార్జున ప్రకటించారు. అరియానా, మోనల్‌లలో ఎవరు ఫైనలిస్ట్ అవుతారో గెస్ చేయమని నాగార్జున హారికను అడిగారు. మోనల్ అని అభిప్రాయపడింది హారిక. కానీ, ఆమె గెస్ తప్పింది. మోనల్ ఎలిమినేట్ అయ్యింది.

ఈ విషయాన్ని నాగార్జున ప్రకటించగానే నిలబడి ఉన్న అరియానా ఒక్కసారిగా కూలబడిపోయింది. తాను సేవ్ అయిన విషయాన్ని నమ్మలేకపోయింది. షాక్‌కు గురైంది. ఆమెను సోహెల్, అభిజీత్ వెంటనే లేవదీశారు.. ఓదార్చారు. మోనల్ ఎలిమినేట్ అయ్యిందంటే అఖిల్ నమ్మలేకపోయాడు. షాకింగ్ ఎక్స్‌ప్రెషన్‌తో అలా చూస్తూ ఉండిపోయాడు. అభిజీత్ వెళ్లి మోనల్‌ను హగ్ చేసుకున్నా అభిజీత్ మాత్రం సోఫాలోనే కూర్చొని షాకవుతూ ఉన్నాడు. కానీ, ఆ తరవాత మోనలే అఖిల్ దగ్గరకు వెళ్లి ఓదార్చింది. అతన్ని హగ్ చేసుకుంది. నవ్వుతూ ఇంటి నుంచి బయటికి వచ్చింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles