Son Of India : సీనియర్ నటుడు మోహన్‌బాబు కొన్నాళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి సాయం కోరారు.. తన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వమని. చాలా సినిమాలకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయా సినిమాలకు తనవంతుగా హైప్ తెచచేందుకు ప్రయత్నించారు.
కానీ, ‘సన్ ఆఫ్ ఇండియా’ ప్రమోషన్లలో ఎక్కడా చిరంజీవి పేరు విన్పించకుండా జాగ్రత్తపడింది ‘మంచు’ ఫ్యామిలీ. విష్ణు నిర్మాతగా, మోహన్‌బాబు ప్రధాన పాత్రలో ‘సన్ ఆఫ్ ఇండియా’ తెరకెక్కింది. అయితే, ఈ సినిమా విడుదల చుట్టూ పెద్ద రచ్చే జరిగింది. ‘మా’ ఎన్నికల వ్యవహారం దగ్గర్నుంచి, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభం వరకు.. చాలా అంశాలు చర్చకు వచ్చాయి. నానా యాగీ చేశారు.
చిరంజీవిని టార్గెట్ చేసేందుకు మంచు కుటుంబం పడరాని పాట్లూ పడింది. తద్వారా సినిమా మీద నెగెటివ్‌గా అయినా హైప్ వస్తుందని బహుశా ‘మంచు’ ఫ్యామిలీ భావించి వుండొచ్చు. కానీ, అందుకు భిన్నంగా నడిచింది వ్యవహారం.
నెగెటివిటీ వల్ల సినిమాకి అదనంగా కలిసొచ్చిన లాభమేమీ లేదు. పైగా, మోహన్‌బాబు మీద సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పడ్డాయ్. మంచు విష్ణు మీద కూడా ట్రోలింగ్ కనీ వినీ ఎరుగని రీతిలో జరిగింది.
అదే, చిరంజీవిని సినిమా ప్రమోషన్ల కోసం తీసుకు వచ్చి వుంటే.. ఖచ్చితంగా ‘సన్ ఆఫ్ ఇండియా’కి హెల్ప్ అయి వుండేదే. ‘మేమిద్దరం మంచి స్నేహితులం..’ అని మోహన్ బాబు, చిరంజీవి పదే పదే చెబుతుంటారు. ఆ స్నేహమెలాంటిదో.. ఇదిగో ఇప్పుడు ఇంకోసారి నిరూపితమైపోయింది.