కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కొత్త సినిమాలు అంగీకరించే విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నటునిగా తనను ఉత్తేజపరిచే చిత్రాలు మాత్రమే చెయ్యాలని డిసైడయ్యారు. 560కి పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించిన ఈ లెజెండరీ యాక్టర్‌ని ఇంప్రెస్ చేసే కథలు రాయడమంటే మాములు విషయం కాదు. తాజాగా మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా లో నటిస్తున్నాడు.
మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా మ్యూజిక్ సిట్టింగ్స్ కు సంబంధించిన వీడియోను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పంచుకున్నారు.
ఈ వీడియోలో మోహన్ బాబు, ఇళయరాజా మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను వీక్షించవచ్చు. మోహన్ బాబు 11వ శతాబ్ద కాలం నాటి గద్యాన్ని ఇళయరాజాకు వినిపించి, దానికి బాణీలు కట్టాలని కోరారు. ఆ గద్యం అత్యంత సంక్లిష్టంగా ఉన్నా గానీ మోహన్ బాబు అలవోకగా పలకడం చూసి ఇళయరాజా ఆశ్చర్యపోయారు. ఇంత కఠినంగా ఉంది, దీనికి బాణీలు ఎలా కట్టాలి? అని ఇళయరాజా వ్యాఖ్యానించగా, అందుకు మీరే సమర్థులు… మీరు చేయనిదంటూ లేదు అని మోహన్ బాబు వినమ్రంగా స్పందించారు.
To produce a movie with legends is a God sent opportunity for me. And to make a iconic prose into a song, only a legend could do it. I wanted to share this video with you.And brining the song visually is another story altogether; that I will share soon. #sonofindia @themohanbabu pic.twitter.com/Yo0USui7Ys
— Vishnu Manchu (@iVishnuManchu) February 20, 2021