Vijay Devarakonda : రౌడీ బాయ్ కీ తండ్రిగా మైక్ టైసన్.. లైగర్ నుండి కొత్త అప్ డేట్…!

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే, విజయ్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది.స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ను ఆగస్టు 25 న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

లైగర్” సినిమా ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఈ సినిమా నుండి బిగ్ అప్ డేట్ వచ్చింది.

ఇందులో మైక్ టైసన్ పాత్ర ఏంటో లీక్ వచ్చేసింది. ఇందులో మైక్ టైసన్ విజయ్ కీ తండ్రిగా నటిస్తున్నారట. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఇక పూరీ జగన్నాథ్ విజయ్ కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తోంది. ఇక ఆ సినిమా పోస్టర్ ను కూడా విడుదల చేసారు పూరీ. జనగణమన గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.