టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లైగర్’ అనేది ఈ సినిమా టైటిల్. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. విజయ్, పూరి జగన్నాథ్ కెరీర్లో ఇదే అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాకు అవుతున్న ఖర్చు మొత్తం రూ. 125 కోట్లు. అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉండేలా ఈ సినిమా రూపొందుతోంది.
అంతేకాదు ఏ టాలీవుడ్ సినిమాకీ లేని ఒక ప్రత్యేకత ఈ సినిమాలో ఉండబోతోంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. చాలారోజుల నుండే మైక్ టైసన్ తో పూరి చర్చలు జరుపుతున్నారట. ఆయన కోసమే అమెరికాలో షూటింగ్ పెట్టాలని పూరి జగన్నాథ్ అనుకున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా నుండి ముఖ్యంగా సినిమా బృందాలను అమెరికాలోకి అనుమతించడంలేదు. అందుకే మైక్ టైసన్ ఇండియా వచ్చేలా చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. ఇదే గనుక నిజమైతే ‘లైగర్’ చిత్రం ఇండియాలోనే స్పెషల్ ఫిల్మ్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.