రానా పై ప్రేమతో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మిహిక.. మీ ప్రేమకు కృతజ్ఞతలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలక్షణ నటుడిగా కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నటువంటి రానా 2020 సంవత్సరంలో మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ దంపతుల గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి.

ఇకపోతే గతంలో ఈ దంపతులు విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రానా దంపతులు ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. అలాగే ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు రాగా మిహికా రాన ఇద్దరు స్పందించి తాము ఇంకా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.ఇలా సోషల్ మీడియాలో వీరి గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆ వార్తలపై స్పందిస్తూ వారి మధ్య ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మిహిక మరోసారి సోషల్ మీడియా వేదికగా రానా పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు.తాజాగా ఈమె రానాతో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేస్తూ నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు మీకు అభినందనలు. మీ దారిలో నడుస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆ విషయాల్లో తప్పకుండా మీరు కూడా ఒకరుగా ఉంటారు అంటూ తన భర్త పై ప్రేమను తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.