బాలయ్యతో మెగాస్టార్ రీసెంట్ హిట్ దర్శకుడు?

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన భారీ హిట్ చిత్రాల్లో అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కె ఎస్ రవీంద్ర(కొల్లి బాబీ) తెరకెక్కించిన భారీ హిట్ సినిమా “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి మెగాస్టార్ కి బాబీ ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికీ తెలిసిందే.

కాగా ఈ చిత్రంతో మెగాస్టార్ కి మాసివ్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు ఇదే సినిమాతో అప్పుడు పోటీకి వచ్చిన నందమూరి నటసింహ బాలయ్య తో సినిమా చేయనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా వీర సింహా రెడ్డి తర్వాత బాలయ్య ఇప్పుడు తన కెరీర్ 108వ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తుండగా..

ఈ సినిమా తర్వాత లైనప్ లో అయితే బాలయ్య ని వాల్తేరు వీరయ్య దర్శకుడు ఒప్పించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ లో కూడా ఓ మాస్ ప్రాజెక్ట్ నే మేకర్స్ చేస్తున్నారట. కాగా బాబీ బాలయ్య కోసం, కూడా ఓ మంచి మాస్ స్టోరీ రెడీ చేయగా బాలయ్య అందుకు ఓకే చెప్పినట్టుగా కూడా రూమర్స్ ఇప్పుడు వినిపించడం విశేషం.

మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సినిమా ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక మరోపక్క ఈ యంగ్ దర్శకుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందని టాక్ ఉంది. ఈ లైనప్ నిజం అయితే బాబీ తన కెరీర్ లోనే మంచి స్టేజ్ కి వచ్చేసినట్టే అని చెప్పాలి.