మెగాస్టార్ క్రేజ్..మరో సినిమాకి 50 కోట్ల ఆఫర్..?

తెలుగు చలన చిత్ర దిగ్గజ నటుడు స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కి బాక్సాఫీస్ దగ్గర ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా హిట్ అయితే భారీ వసూళ్లు ప్లాప్ అయితే అంతే రీతిలో భారీ నష్టాలు మెగాస్టార్ కి తప్పవు.

కానీ ఈసారి షాకింగ్ అంశం ఏమిటంటే ఆచార్య లాంటి ఎపిక్ డిజాస్టర్ తర్వాత కూడా మెగాస్టార్ వరుస సినిమాలకి క్రేజీ ఆఫర్స్ వస్తుండడం విశేషం. ఆల్రెడీ తాను చేసిన లేటెస్ట్ సినిమా “గాడ్ ఫాదర్” కి గాను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి 56 కోట్ల భారీ ఆఫర్ తో సొంతం చేసుకోగా..

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మెగాస్టార్ నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా మెగా 154 కి కూడా 50 కోట్ల భారీ ఓటిటి ఆఫర్ వచ్చినట్టుగా సినీ వర్గాల్లో టాక్ కోడై కూస్తుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ వారే ఈ భారీ అమౌంట్ ఇచ్చి సొంతం చేసుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ నిజం అయితే మాత్రం ఇది పూర్తిగా మెగాస్టార్ క్రేజ్ వల్లే అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే డిఎస్పీ సంగీతం అందిస్తున్నాడు.