చిరంజీవిని అనిల్ రావిపూడి మెప్పించాడా.?

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, కథ విషయంలోనే నిన్న మొన్నటిదాకా ఒకింత కన్‌ఫ్యూజన్ వుంటూ వచ్చింది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కథ దాదాపుగా ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం బడ్జెట్ ఇష్యూస్ దగ్గర నిర్మాత దిల్ రాజు కొంచెం తటపటాయిస్తున్నాడన్నది తాజా ఖబర్.

‘భోళా శంకర్’ రిజల్ట్ తర్వాత, చిరంజీవి తదుపరి సినిమా మార్కెట్ విషయమై నిర్మాతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. ‘దిల్’ రాజు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. అయితే, సినిమాని అనుకున్న బడ్జెట్లో లాగించెయ్యడం అనిల్ రావిపూడికి బాగా తెలుసు.

అన్నీ కుదిరితే, అతి త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోందిట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’, విపరీతమైన నెగెటివిటీ మధ్యన ‘మమ’ అనిపించేసిన సంగతి తెలిసిందే.

చిరంజీవి వైపు నుంచి కాదు, అనిల్ రావిపూడి వైపే కొంత అనుమానాస్పదంగా దిల్ రాజు చూస్తున్నారన్న వాదనా లేకపోలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.