పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ ఇచ్చిన మెహర్ రమేష్..!

టాలీవుడ్ సినిమా దగ్గర తన సినిమాలకి అంటూ ఒక బ్రాండ్ ఉండే దర్శకులు చాలా మందే ఉన్నారు. అయితే అలాంటి దర్శకుల్లో ప్లాప్ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఒకరు. అయితే మెహర్ వ్యక్తిగతంగా చాలా మంచి వారు అని అంతా అంటూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు తాను చేసే సినిమాలు టాలీవుడ్ లో  ఘోరమైన డిజాస్టర్ సినిమాలుగా నిలిచిపోయాయి.

దీనితో మెహర్ ని చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “భోళా శంకర్” కూడా ప్లాప్ అయ్యింది. అయితే తాను ఈ సినిమాకి చాలా మంది వర్క్ అందించాడు కానీ చాలా ఇతర ఫాక్టర్ లతో సినిమాని డిజాస్టర్ చేశారు కొందరు.

దీనితో మెహర్ పై మరింత బ్యాడ్ మార్క్ పడిపోగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మెహర్ షాకిచ్చాడు. తాను పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేస్తానని అంతే కాకుండా ఖచ్చితంగా ఆ సినిమా ఎప్పటికి అయినా చేసి తీరుతానని అంటున్నాడు.

తన దగ్గర పవన్ కోసం రెడీ చేసుకున్న ఓ కథ ఎప్పటి నుంచో ఉందని డెఫినెట్ గా ఆ కథ పవన్ తో చేసి తీరుతానని మెహర్ రమేష్ అంటున్నాడు. దీనితో ఈ కామెంట్స్ విన్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షాకవుతున్నారు. మరి ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నా మెహర్ రమేష్ అన్నంత పని చేస్తాడో ఏమో చూడాలి.