మెగాస్టార్ నటించే ఆ సినిమాకి క్రేజీ టైటిల్ ఫిక్స్ !

tollywood megastar chiranjeevi tests corona positive

మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా “లూసిఫర్” రీమేక్. ఈ సినిమాని మెగాస్టార్ లాంఛ్ చేసినప్పటి నుండి ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమిటి ఆ టైటిల్ అంటే ‘రారాజు’ అట. అరె నిజంగా ఈ టైటిల్ మాత్రం మెగాస్టార్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మరి చూడాలి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా , లేక మళ్ళీ మారుస్తారా అని.

మెగాస్టార్ నే కాద‌న్నంత మ‌గాడా?

ఎలాగూ సినిమాలో హీరోయిజమ్ పై పుష్కలమైన ఎలివేషన్స్ ఉంటాయి. కాబట్టి టైటిల్ కూడా అలాగే ఉండాలి. ఆ లెక్కన ఇంతకు మించిన మంచి టైటిల్ మరొకటి దొరకదు. అయితే ప్రసుతం ‘ఆన్న’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ చిరును ఈ సినిమాలో పంచెకట్టులో ఫుల్ లెంగ్త్ రోల్ లో చూడబోతున్నారు. అందుకే ఫ్యాన్స్ కూడా తెగ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా సైతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కథలో కీలక మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది.

కాగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలిమ్స్ , ఎన్‌విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌ పై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నేపథ్య సంగీతం కోసం థమన్ ఫారెన్ వెళ్లి కొత్త సంగీత వాయిద్యాలతో ట్యూన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో క్యాస్టింగ్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయశాంతి.. మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని.. అలాగే మెగాస్టార్ అనుచరుడి పాత్రలో సత్యదేవ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.